: అమెరికాలో మరో దాడి.. సిక్కు యువకుడి తలపాగాను ఎత్తుకెళ్లిన వైనం
అమెరికాలో మరో విద్వేష దాడి జరిగింది. న్యూయార్క్ లో సిక్కు క్యాబ్ డ్రైవర్ హరకీరత్ సింగ్ (25) పై నలుగురు ప్రయాణికులు దాడికి దిగి, దుర్భాషలాడారు. అతడి తలపాగాను ఎత్తుకెళ్లి అవమాన పరిచారు. తనపై జరిగిన దాడిపై హరకీరత్ సింగ్ మాట్లాడుతూ... తన కారులోకి బాగా తాగివున్న ప్రయాణికుడితో పాటు మరో ముగ్గురు ఎక్కారని అన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలని అడిగితే, సరిగ్గా చెప్పకుండా తనతో దుర్భాషలాడారని చెప్పాడు. వారిలో ఒకడు తన చేతిపై దాడి చేశాడని, తాము ఎంతో పవిత్రంగా భావించే తలపాగాను తీసేసి ఎత్తుకెళ్లారని తెలిపాడు. తనకు న్యూయార్క్‌లో పనిచేయాలంటే భయం వేస్తోందని అన్నాడు. ఈ ఘటనపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.