: రాజకీయాలు తెలియని దీపతో ఉండటమెందుకు?: పన్నీర్ వర్గంలో చేరిన మలరవన్


దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రాజకుమార్ కు రాజకీయాలంటే ఎంతమాత్రమూ ఆసక్తి లేదని, ఆమె కనీసం రాజకీయాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే, నిన్నటి వరకూ దీపకు ప్రధాన అనుచరుడిగా ఉండి, ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయిన మలరవన్ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దీప బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న తరువాత, మలరవన్, స్వయంగా చెన్నైలో మకాం వేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె కోసం ప్రత్యేక ప్రచార రథాన్ని సైతం తయారు చేయించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆమెకు హ్యాండిచ్చారు. దీపకు రాజకీయ అనుభవం లేదని విమర్శించిన ఆయన, ఆమెతో కొనసాగడం ఇష్టం లేకనే పన్నీర్ సెల్వం వంటి నేత వద్దకు వచ్చినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News