: ఇకపై వారానికి ఒక మిసైల్ పరీక్షిస్తాం: నార్త్ కొరియా దూకుడు


అమెరికా కన్నెర్ర చేస్తున్నా ఉత్తరకొరియా మాత్రం దూకుడు తగ్గించడం లేదు. ఇకపై వారానికో క్షిపణిని పరీక్షిస్తామని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి  చెప్పారు. అవసరమైతే వారానికి, నెలకు, ఏడాది లెక్కన క్షిపణులను ప్రయోగిస్తామని తెలిపారు. పదే పదే మిస్సైల్స్ ను పరీక్షిస్తూ, తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో, ఉత్తరకొరియా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు ఉత్తరకొరియాపై సైనిక చర్యకు అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News