: మోదీతో భేటీ అయిన అమెరికా భద్రతా సలహాదారు

ప్రధాని మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్ మాస్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ చర్చించారు. దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులపై కూడా మాట్లాడుకున్నారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ కూడా హాజరయ్యారు.
అనంతరం ఎన్ఎస్ఏ అధికారి అజిత్ ధోవల్ తో కూడా మెక్ మాస్టర్ భేటీ అయి, పలు విషయాలపై చర్చించారు. భారత పర్యటనకు ముందే పాక్, ఆఫ్ఘనిస్థాన్ లలో మెక్ మాస్టర్ పర్యటించారు.