: ఠారెత్తిస్తున్న ఎండలు... ఆరు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు!


తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వరంగల్, రెంటచింతలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం అందరిలోను ఆందోళన పెంచుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత సూర్యుడి భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత రెండు రోజులు హైదరాబాదులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రానున్న నాలుగు రోజులు ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని, పెద్దలు, పిల్లలు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

ఎండ నుంచి ఉపశమనం పొందే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మరోనాలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరించినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని తెలిపారు. ఎండల తీవ్రతకు పరిసరాలు నిప్పుల కొలిమిలా మారిపోతాయని, దీంతో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వారు హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News