: కడపునిండా తినేసి బిల్లు కట్టకుండా సముద్రంలోకి దూకేశాడు.. పోలీసులు ఈదుకెళ్లి బతిమాలి తీసుకొచ్చారు!


కడుపునిండా తినేసి బిల్లుకట్టకుండా సముద్రంలోకి పారిపోయిన వ్యక్తిని పోలీసులు బతిమాలి మరీ తీసుకొచ్చిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... టెర్రీ పెక్ అనే యువకుడు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో సముద్రపు ఒడ్డున ఉన్న ఒమెరోస్ బ్రదర్స్ సీఫుడ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. మధ్యలో రెండు బీర్లు కూడా తాగాడు. మొత్తం భోజనం పూర్తయ్యాక చూసుకుంటే 35,000 రూపాయల బిల్లు అయ్యింది, తన జేబులో చూసుకుంటే అంత డబ్బులు లేవు. దీంతో ఏం చెయ్యాలో అర్ధంకాక అక్కడి నుంచి పరుగుతీశాడు.

అతనిని రెస్టారెంట్ సిబ్బంది అనుసరించినప్పటికీ అతను సముద్రంలోపలికి పారిపోతుండడంతో ఏం చేయాలో అర్థం కాక... పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు రంగప్రవేశం చేసి, రెండు బోట్లతో సముద్రంలోపలికి వెళ్లి, అతనిని వెనక్కి రావాలని ఆదేశించారు. దానికి అతను ససేమిరా అనడమే కాకుండా సముద్రంలోపలికి ఈదుకుంటూ వెళ్లడంతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దానికి అతను లొంగకపోవడంతో బలవంతంగా అతనిని ఒడ్డుకు తీసుకొచ్చారు. 

  • Loading...

More Telugu News