: పల్లె తల్లి అయితే, పట్నం ప్రియురాలే: లోకేష్
పల్లెటూరు తల్లి వంటిదైతే, పట్నం ప్రియురాలు వంటిదని, తల్లి బిడ్డ కడుపును ఆప్యాయంగా రమ్మంటుందని, పట్నం తనకేమైనా తెమ్మంటుందని ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నేడు తొలి అధికారిక పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, పల్లెలను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పంచాయితీ రాజ్ శాఖను తాను స్వీకరించినట్టు తెలిపారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.