: ఎందుకు అల్లరి చేస్తున్నావని టీచర్ కొడితే... తిరిగి టీచర్ ని కొట్టిన విద్యార్థి!


గతంలో పిల్లలకు చదువు చెప్పే క్రమంలో టీచర్ కొట్టినా తిట్టినా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెద్దలే కాకుండా, విద్యార్థులు కూడా టీచర్లపై తిరగబడుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి ఏ స్థాయిలో వుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... చైనాలోని ఓ స్కూల్ లో అల్లరి చేస్తున్న విద్యార్థిని టీచర్ మందలించారు. పద్దతి మార్చుకోకపోతే శిక్షించాల్సి వస్తుందని హెచ్చరించారు.

దీంతో ఆ విద్యార్థి టీచర్ కు చెంప చూపిస్తూ కొట్టి చూపించమని సవాలు విసిరింది. దీంతో టీచర్ మళ్లీ ఆమెను హెచ్చరించారు. అయినప్పటికీ విద్యార్థిని సహవిద్యార్థినుల ముందు డాంబికం ప్రదర్శించడంతో టీచర్ ఒక్కటిచ్చారు. అంతే .. ఆమె కూడా టీచర్ ను కొట్టింది. దీంతో బిత్తరపోయిన టీచర్ మరోసారి చెంపదెబ్బకొట్టారు. స్టూడెంట్ కూడా మళ్లీ అదే రీతిలో రియాక్ట్ అయింది. దీంతో ఇద్దరూ ఒకరి జుట్టు మరొకరు అందుకున్నారు. వారిని విడదీసేందుకు తరగతిలో ఉన్న విద్యార్థినులు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News