: 2011లో తనను అరెస్ట్ చేయించిన నటినే పటాయించిన సుకాష్... ఆపై ఎన్నో 'బంటీ ఔర్ బబ్లీ' పనులు!


ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసి, 17 సంవత్సరాల వయసులోనే వైట్ కాలర్ నేరాలకు తెరతీసి, గడచిన దశాబ్ద కాలంలో పలుమార్లు జైలుకు చుట్టంచూపుగా అలా వెళ్లి, ఇలా వచ్చేసే సుకాష్ చంద్రశేఖరన్ గురించిన మరింత సమాచారం ఇది. పలు వార్తా సంస్థలు సుకాష్, జీవిత చరిత్రను తవ్వి తీసి ప్రచురించగా, అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2011లో సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, లీనా పాల్ ను మోసం చేసిన కేసులో, ఆమె ఫిర్యాదు మేరకు సుకాష్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆపై బెయిలు మీద బయటకు వచ్చి, ఆమెనే తన దానిని చేసుకుని తన మోసాల్లో భాగస్వామిని చేశాడు.

వీరిద్దరూ కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలోలా ఎన్నో పనులు చేసి కోట్లాది రూపాయల మేరకు ఎంతో మందిని మోసం చేశారు. వీరి చేతుల్లో మోసపోయిన వాళ్లలో సినీనటులు కూడా ఉండటం గమనార్హం. ఇద్దరూ కలిసి తక్కువ ధరలకు కార్లను ఇప్పిస్తానని ఓ తమిళ నటుడిని రూ. 5 లక్షలకు మోసం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడకు దగ్గరి సన్నిహితుడినని చెబుతూ మోసాలకు పాల్పడ్డాడు. ఆపై లీనా మారియాకు జాన్ అబ్రహాం నటించిన 'మద్రాస్ కేఫ్'తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా 'రెడ్ చిల్లీస్'లో అవకాశాలు ఇప్పించాడు.

  • Loading...

More Telugu News