: టీడీపీకి గుడ్ బై చెప్పిన దాడి


టీడీపీ అసమ్మతి నేత దాడి వీరభద్రరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల కాలంలో దాడి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం విశాఖలో జరిగిన బాబు పాదయాత్ర ముగింపు సభకు కూడా దాడి హాజరుకాలేదు. దాడి శాసనమండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. నేటితో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. కాగా, మరోసారి తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదని బాబుపై దాడి అలకబూనారు. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో బాబుకు పంపారు.

  • Loading...

More Telugu News