: ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగింపు... అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పన్నీర్ సెల్వం... ఇరు వర్గాలకూ ఓకే!


తమిళనాట సీఎం పళనిస్వామి, చీలికనేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం ఓ కొత్త ఫార్ములాకు ఇద్దరు నేతలూ ఓకే చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగుతారని, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పన్నీర్ సెల్వం ఉంటారని ఈ ఒప్పందం రెండు వర్గాలకూ ఆమోదయోగ్యమేనని పన్నీర్ సెల్వం వర్గంలోని ఓ సీనియర్ ఎంపీ ఎన్డీటీవీతో తెలిపారు. పూర్తి స్పష్టత వచ్చిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముందని ఆయన అన్నారు. కాగా, సోమవారం నాడు మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాము పన్నీర్ సెల్వంను చర్చలకు ఆహ్వానిస్తున్నామని ప్రకటించిన తరువాత పరిణామాలు శరవేగంగా మారుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News