: నెహ్రూ అంతిమయాత్ర ప్రారంభం.. భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు
తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంతిమయాత్ర ప్రారంభమైంది. గుణదలలోని ఆయన ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమయాత్రకు భారీ ఎత్తున టీడీపీ నేతలు, నెహ్రూ అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. మరోవైపు, నెహ్రూ భౌతిక కాయానికి మంత్రులు పరిటాల సునీత, ఆదినారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు నివాళి అర్పించారు.