: బ్రేకింగ్ న్యూస్... పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ రాజీనామా?
ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ రాజీనామా చేశారా? అంటే అవుననే తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ డిప్యూటీ చీఫ్ టీటీవీ దినకరన్ విచారణ నేపథ్యంలో చెన్నైలో వేగంగా మారుతున్న పరిణామాల క్రమంలో పళనిస్వామి వర్గం కేబినెట్ భేటీ నిర్వహించి, పన్నీరు సెల్వంతో చర్చలు జరిపారని, దీంతో ఆయన డిమాండ్ మేరకు పార్టీ పదవులకు రాజీనామా చేయాలని శశికళ, దినకరన్ లను కోరారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జైలు నుంచే శశికళ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం, పళనిస్వామి (శశికళ) వర్గాలు కలిసిపోనున్నాయని సమాచారం. అంతే కాకుండా పార్టీలో శశికళ, మన్నార్ గుడి మాఫియాకు ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్న ఒప్పందంతోనే వారిద్దరూ ఒక్కటవుతున్నట్టు తెలుస్తోంది. అలా జరిగితే శశికళ కలలన్నీ కల్లలయ్యే అవకాశం కనిపిస్తోంది.