: వార్నర్ ఒంటరి పోరాటం...కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం 160
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 19వ ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదుకు వార్నర్ (70), శిఖర్ దావన్ (15) శుభారంభం ఇచ్చారు. అనంతరం హెన్రిక్స్ (9), యువరాజ్ సింగ్ (0) వెంటవెంటనే అవుట్ కావడంతో సన్ రైజర్స్ తడబడింది. నమన్ ఓజా (34) ఆకట్టుకోగా, దీపక్ హూడా (12) మరోసారి నిరాశపరిచాడు. మహ్మద్ నబీ (2) విఫలమయ్యాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ తోపాటు రషీద్ ఖాన్ (6) నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెరొక రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, సందీప్ శర్మ, కరియప్ప చెరొక వికెట్ తీసి వారికి సహకరించారు. కాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.