: ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లాడి ముఖం చాటేశాడని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత!


ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ముఖం చాటేశాడని ఆరోపిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సుజాత అనే యువతి భర్త యశ్వంత్ ఇంటి ముందు మౌన దీక్షకు దిగిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన యశ్వంత్‌ హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన యశ్వంత్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడని, దానికి తాను అంగీకరించడంతో తామిద్దరం వివాహం చేసుకున్నామని తెలిపింది. అయితే వివాహానంతరం తనను మోసం చేశాడని, ఇప్పుడు ముఖం చాటేశాడని ఆమె ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. 

  • Loading...

More Telugu News