: ఆ టీవీ యాంకర్ నా భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది... అందుకే నా 13 ఏళ్ల కొడుకుపై కేసుపెట్టింది: బాలుడి తల్లి
ఒక తెలుగు టీవీ ఛానెల్ లో 'అబ్బబ్బబ్బహా' అనే వంటల కార్యక్రమంతో పాటు, మరో ఛానెల్ లో ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమం నిర్వహించే యాంకర్ గీతా భగత్ తనను దూషించడంతోపాటు, తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ బాలుడు (13), అతడి తల్లి శ్వేత (36), బాలుడి అమ్మమ్మ రాజకుమారి (74) తో పాటు పక్కింట్లో ఉండే సుబ్బారావు (70)లపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై శ్వేత స్పందిస్తూ... యాంకర్ గీతా భగత్ తన భర్త మధుకర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించారు.
గత ఎనిమిదేళ్లుగా గీతా భగత్ తమను వేధిస్తోందని ఆమె అన్నారు. మధుకర్, గీతా భగత్ కలిసి తన కుమారుడ్ని చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే తన కొడుకును టార్చర్ చేస్తున్నారని, ఆ కోపంతో 504, 506, 509, రెడ్ విత్ 34 లాంటి సెక్షన్ల కింద కేసు పెట్టారని, 13 ఏళ్ల పిల్లాడికి అసలేం తెలుసని ఇలాంటి కేసులు పెడతారని ఆమె ప్రశ్నించారు. దీనిపై నిందిత బాలుడు మాట్లాడుతూ, ఏదో ఒక వంకతో తన తల్లిని తిడుతుంటారని అన్నాడు. గత నెల 6న పెద్ద గొడవైందని, పోలీసుల సమక్షంలోనే వారు తన తల్లిని కొట్టారని బాలుడు చెప్పాడు. దీంతో ఈ వివాదం కొత్తమలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.