: దీదీకి షాక్.. 13 మంది నేతలపై సీబీఐ కేసు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సీబీఐ షాక్ ఇచ్చింది. నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో 13 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వీరిలో పార్టీ సీనియర్ నేతలు ముకుల్ రాయ్, సౌగత రాయ్, మదన్ మిశ్రా తదితరులు కూడా ఉన్నారు. నెలరోజుల్లోగా కేసు విషయాన్ని తేల్చాలంటూ సీబీఐని ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ గడువు ముగుస్తుండటంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కిందం నేరం చేశారని, కుట్రలకు పాల్పడ్డారని ఈ కేసులో సీబీఐ పేర్కొంది.