: అక్రమాస్తుల కేసులో పన్నీర్ సెల్వం మద్దతుదారుడికి జైలు శిక్ష

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్నీర్ సెల్వం మద్దతుదారుడైన అరంగనాయకంకు జైలు శిక్ష పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం అతనికి మూడేళ్ల శిక్షను విధించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో (1991-1996) అరంగనాయకం విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. జయ మరణం తర్వాత అన్నాడీఎంకే చీలిపోవడంతో... ఈయన పన్నీర్ సెల్వం శిబిరంలో చేరారు. 

More Telugu News