: దేవుడు కరుణించకపోతే.. చంద్రబాబు తండ్రి అయినా, మా తండ్రి అయినా ఏమీ చేయలేరు: జేసీ
అనంతపురం జిల్లాలో కరవు, నీటి సమస్యపై నేడు సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో, జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సీపీఎం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనను విరమింపజేసేందుకు టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో జేసీ మాట్లాడుతూ, ఏదైనా ఉంటే అధికారుల వద్ద కూర్చొని మాట్లాడాలని, కలెక్టర్ వద్ద కూర్చొని మాట్లాడుకుందామని... అంతేకాని అల్లరి చేస్తూ 'నశించాలి నశించాలి' అంటే ఏం నశించాలని ప్రశ్నించారు. వర్షాలు పడకపోతే ఏమీ చేయలేమని... దేవుడు కరుణించకపోతే చంద్రబాబు ఏమీ చేయలేడు, వాళ్ల తండ్రి ఏమీ చేయలేడు, మా తండ్రి కూడా ఏమీ చేయలేడని అన్నారు.