: మురళీ బౌలింగ్ కు రాగానే.. చావొచ్చి పడిందని అనుకునేవాడిని!: సెహ్వాగ్


టెస్ట్ లు, వన్డేలు, టీ20ల్లో కలిసి శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లు పడగొట్టాడు. 1972లో పుట్టిన మురళీ జన్మదినం నేడు. నేటితో అతనికి 45 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా మురళీకి భారత మాజీ స్టార్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 'గొప్ప మనిషికి జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. మురళీ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని ఈ సందర్భంగా వీరూ చెప్పాడు. మురళీ బౌలింగ్ కు రాగానే... 'పెద్ద చావొచ్చి పడింది' అనుకునేవాడినని అన్నాడు. 

  • Loading...

More Telugu News