: ఈ విషయంలో చిరంజీవి, అల్లు అరవింద్, బన్నీ అభినందనీయులు: కల్యాణ్ రామ్


సంక్రాంతికి విడుదలై ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న చిత్రం 'శతమానం భవతి'. 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి'లాంటి భారీ సినిమాల మధ్య విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి సినిమా చేయాలంటూ తన భార్య కూడా కోరిందని చెప్పాడు. ఇంతటి గొప్ప సినిమాను నిర్మించిన దిల్ రాజుకు సన్మానం చేయాలనే ఆలోచన వచ్చినందుకు చిరంజీవి, అల్లు అరవింద్, బన్నీలకు అభినందలను తెలియజేస్తున్నానని అన్నాడు. 

  • Loading...

More Telugu News