: ఆ 27 గంటలు నరకంలో ఉన్నట్టు అనిపించింది: నిర్మాత దిల్ రాజు


టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడైన దిల్ రాజు సతీమణి అనిత ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న సమయంలో, తెల్లవారుజామున 5.30 గంటలకు అనిత చనిపోయినట్టు అతని అల్లుడు అర్చిత్ ఫోన్ చేసి చెప్పాడట. దీంతో, రాజు షాక్ కు గురయ్యాడట. కొంత సేపు ఏమీ అర్థంకాలేదట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వెంటనే డైరెక్టర్ హరీష్ శంకర్ ఫోన్ చేసి... అమ్మాయిని (రాజు కుమార్తె) చూడలేకపోతున్నామని... వీలైనంత త్వరగా రావాలని చెప్పాడట. ఈ నేపథ్యంలో, అమెరికా నుంచి ఇక్కడకు రావడానికి 27 గంటల సమయం పట్టిందట. ఆ 27 గంటలు తనకు నరకంలో ఉన్నట్టు అనిపించిందని రాజు తెలిపారు. విమాన ప్రయాణంలో తనకు గత జ్ఞాపకాలు కదలాడాయని... కన్ను మూత కూడా పడలేదని ఆవేదనాపూరితంగా చెప్పారు. అమెరికా వెళ్లే రోజున తన కోసం అనిత పావ్ బాజీ చేసిందని... అదే ఆమె చేతుల మీదుగా తాను తిన్న ఆఖరి ఫుడ్ అని అన్నారు. అనిత లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News