: సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్


సహారా ఇండియా చీఫ్ సుబ్రతో రాయ్ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లిస్తారా? లేక మళ్లీ జైలుకు వెళ్తారా? అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సహారా అస్తుల వేలం తప్పదని స్పష్టం చేసింది. డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు పూణేలోని అంబీ వ్యాలీని వేలం వేయాలని సూచించింది. 14 వేల కోట్ల బకాయిల్లో ఐదువేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని సహారా సంస్థ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. గడువు తీరినా సహారా సంస్థ ఎలాంటి ముందడుగు వేయకపోవడంతో అంబీ వ్యాలీని 5 వేల కోట్ల రూపాయలకు విక్రయించి, బకాయిలు తీర్చాలని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 28న జరగనుండడంతో అప్పటి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోపు 5 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, సుబ్రతోరాయ్ పెరోల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News