: ఇండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా


మన దేశంపై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. బౌద్ధ మత గురువు దలైలామాను అడ్డు పెట్టుకుని చైనా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా భారత్ ప్రయత్నించరాదంటూ వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటన వల్ల ఇరు దేశ సంబంధాలు మరోసారి దెబ్బతిన్నాయని తెలిపింది. భారత్-చైనా సంబంధాలపై దలైలామా పర్యటన ప్రభావాన్ని చూపిందని... టిబెట్ పై తమ కట్టుబాటును భారత్ గౌరవించాలని చెప్పింది. చైనాను అంతర్జాతీయ సమాజం ముందు తక్కువ చేసి చూపేందుకు... దలైలామాను ఇండియా వాడుకోకూడదని తెలిపింది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్ లో భాగమంటూ చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్ పర్యటనను చైనా తప్పుబడుతోంది. అయితే, చైనా డిమాండ్ ను భారత్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

  • Loading...

More Telugu News