: ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు షాకింగ్ న్యూస్ చెప్పిన వైద్యులు!


కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులకు వైద్యులు ఎవరూ ఊహించని షాకింగ్ విశేషాన్ని వివరించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని అలబామా స్టేట్ లోని మిస్సిసిపి ప్రాంతంలో ఒక కళాశాలలో చేరిన యువతి, యువకుడు ఇద్దరూ ఒకేలా ఉండడంతో మొదట ఆశ్చర్యపోయారు. తరువాత స్నేహితులయ్యారు.. ఆ స్నేహం ప్రేమగా మారడంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పిల్లల్ని కనే క్రమంలో టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ కోసం వైద్యులను సంప్రదించగా, డీఎన్ఏ టెస్టు చేయాలని సూచించారు. దీంతో వారిద్దరు అందుకు తమ బ్లడ్ శాంపిల్ ఇచ్చారు. దానిని పరీక్షించిన వైద్యులు షాకింగ్ వార్త చెప్పారు.. వారిద్దరూ కవలలని తేల్చారు. అయితే చిన్నతనంలోనే వీరి తల్లిదండ్రులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారిని రెండు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి.

దీంతో వారికి తాము తోడబుట్టినవారమని కానీ, కవలలమని కానీ తెలియదు. దీంతో వారి వివరాలు సరిచూసిన వైద్యులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మీడియాకు తెలిపారు. వాస్తవానికి, స్థానిక చట్టాల ప్రకారం తోబుట్టువులు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు 32 వేల రూపాయల జరిమానా విధించాల్సి ఉంది. కానీ వారిద్దరికీ తోబుట్టువులనే విషయం తెలియదు, ఉద్దేశ్యపూర్వకంగా పెళ్లి చేసుకోలేదని అందుకే వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, వారి ప్రైవసీని పరిగణనలోకి తీసుకుని వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నామని వైద్యులు తెలిపారు. 

  • Loading...

More Telugu News