: 'దేనినేని నెహ్రూ గొప్ప నేత' అంటూ ప్రశంసించిన కమ్యూనిస్ట్ అగ్ర నేత!
ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. విద్యార్థి దశ నుంచే చాలా చురుగ్గా ఉన్న నెహ్రూ రాజకీయాల్లో సైతం తన ప్రభావాన్ని చూపించారని కొనియాడారు. నెహ్రూతో వ్యక్తిగతంగా తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. తామిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చించుకునేవారమని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలలో సైతం నెహ్రూ తనదైన ముద్ర వేశారని చెప్పారు. తనకు తాను విధించుకున్న కొన్ని రాజకీయ లక్ష్యాల కోసం తుది శ్వాస వరకు పోరాటం సాగించిన వ్యక్తి నెహ్రూ అని అన్నారు. నెహ్రూ లేని లోటు విజయవాడకే కాదని, ఏపీ మొత్తానికి తీరని లోటు అని అన్నారు. నెహ్రూ మరణం తనను కలచి వేసిందని, ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. నెహ్రూ కుమారుడు అవినాశ్ కు, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.