: నాలుగేళ్ల పాప కోసం కాన్వాయ్ ఆపేసిన మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మనసులు గెలుచుకోవడంలో ముందుంటారు. తాజాగా సూరత్ లో కూడా ఆయన ఒక చిన్న ఘటనతో గుజరాత్ ప్రజల మనసులు గెలుచుకున్నారు. సూరత్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో రోడ్డుకిరువైపులా వీడ్కోలు చెబుతున్న అభిమానులకు అభివాదం చేస్తూ వెనుదిరుగుతున్నారు. ఈ సమయంలో నౌసీ అనే నాలుగేళ్ల బాలిక ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్లింది. ఈ సమయంలో ఆయన సెక్యూరీటీ సిబ్బంది నౌసీని అడ్డుకున్నారు. దీనిని చూసిన ప్రధాని కారును ఆపించి, నౌసీని తీసుకురావాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు బాలికను ప్రధాని కారులోకి తీసుకెళ్లారు. ప్రధాని బాలికతో కాసేపు ముచ్చటించి, తిరిగి పంపేశారు. దీంతో అక్కడి వారు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.