: కేశినేని నాని అబద్ధాలు చెబుతున్నారు... అడిగితే పోలీసులతో కొట్టిస్తామంటున్నారు: కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ధర్నా


టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో వివాదంలో చిక్కుకున్నారు. తన జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని, చాలా కష్టపడి ఎదిగానని, తనపై వైఎస్సార్సీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, చెడ్డపేరు తెచ్చుకోవడం ఇష్టం లేక... కేవలం మాట కోసం తన ట్రావెల్స్ వ్యాపారం మూసేశానని ఘనంగా ప్రకటించిన ఎంపీ కేశినేని నాని మాటలు నీటిమూటలని తేలిపోయింది. నేడు విజయవాడలో కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ధర్నా చేశారు.
 
తమకు మొత్తం జీతంతోపాటు, అదనంగా మరో మూడు నెలల జీతం చెల్లించామని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని, కేశినేని ట్రావెల్స్ మూసేయడం వల్ల 1500 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వలేదని వారు తెలిపారు. జీతం అడిగేందుకు ఆఫీసుకు వెళ్తే...ఎంపీ గారికి కోపం వస్తే పోలీసులతో కొట్టిస్తారని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం అబద్ధాలు చెబుతూ, తమను మోసం చేస్తోందని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News