: చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మా పార్టీకి ఏం కాదు: అంబటి రాంబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీకి ఏమీ కాదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులను ఉపయోగించి ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు కాలరాస్తున్నారని, ప్రతిపక్షాన్ని బలహీనపరిచి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.