: ఆయనతో కలిసి పనిచేశాను.. జైలుకీ వెళ్లాను: దేవినేని అనుచరుడు గాంధీ
దేవినేని నెహ్రూ మళ్లీ టీడీపీలోకి రావడంతో సంతోషించామని, అందరం కలిశామని అనుకుంటున్న తరుణంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుందని ఆయన అనుచరుల్లో ఒకరిగా చెప్పుకునే గాంధీ అన్నారు. విజయవాడలోని దేవినేని నెహ్రూ నివాసం వద్ద ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, దేనినేని నెహ్రూతో విద్యార్థి దశ నుంచి కలిసి తిరిగామని, స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేసి కలిసి పని చేశామని, జైలుకు కలసి వెళ్లామని అన్నారు.
1978లో దేవినేని గాంధీ, నెహ్రూ, బాజీ, మురళీ కలిసి తిరిగేవాళ్లమని చెప్పుకొచ్చారు.1979లో స్టూడెంట్ యూనియన్ ప్రారంభించిన కొన్నేళ్లకు, టీడీపీలో చేరామన్నారు. అయితే, 1995లో తమ మధ్య విభేదాలు రావడం, నెహ్రూ పార్టీ మారడం జరిగిందన్నారు. ఎవరు ఏ పార్టీలో కొనసాగినప్పటికీ అన్నదమ్ముల్లానే ఉండేవారమని, మర్యాదపూర్వకంగా పలకరించుకునేవాళ్లమని చెప్పారు.