: తాజా పరిణామాలతో దినకరన్ ఉక్కిరిబిక్కిరి... సలహా కోసం శశికళ చెంతకు పయనం?

ఓ వైపు ఎన్నికల్లో డబ్బు పంచినట్టు పోలీసులు, ఈసీ కేసులు, అధికారంలో ఉన్నప్పటికీ, మంత్రులపై ఐటీ దాడులు, తాజాగా ఎన్నికల కమిషన్ కు లంచాలు ఇవ్వజూపిన ఆరోపణలు... వీటన్నింటితో ఉక్కిరిబిక్కిరవుతున్న టీటీవీ దినకరన్, తాజా పరిణామాలపై చిన్నమ్మ శశికళతో చర్చించి, ఆమె సలహాలు తీసుకునేందుకు బెంగళూరు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోగా జైల్లో ఉన్న శశికళను కలిసి, తదుపరి ఏం చేయాలన్న విషయమై సూచనలు తీసుకోవాలని దినకరన్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనను పార్టీ నుంచి తప్పించి, తప్పు తమది కాదని భావించేందుకు కొందరు మంత్రులు పావులు కదుపుతున్న నేపథ్యంలో, ఆందోళన చెందుతున్న ఆయన, శశికళ మద్దతు తనకు ఉందని నిరూపించుకోవాల్సి వుందని, అందుకే ఆయన పరప్పన అగ్రహార జైలుకు హుటాహుటిన వెళుతున్నారని సమాచారం.