: ప్రపంచ యుద్ధాల నివారణకు రాంగోపాల్ వర్మ చిన్న చిట్కా!
ప్రపంచ యుద్ధాలు జరుగకుండా చూసేందుకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిట్కా చెప్పాడు. యుద్ధాలకు దిగాలని భావించే దేశాల అధినేతలు, స్వయంగా బరిలోకి దిగి పోరాడి ఎవరు గెలుస్తారో తేల్చుకోవాలని సూచించారు. ఇలా చేస్తే, డబ్బు ఖర్చు తగ్గుతుందని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతకు కొద్దిసేపటి ముందు 'మీట్ మిస్టర్ కిమ్ డొనాల్డ్ జాంగ్ ట్రంప్ ఉన్' అంటూ, ఉత్తర కొరియా నియంత కిబ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల ఫోటోలను కలిపి మార్ఫింగ్ చేసి సృష్టించిన ఓ ఫోటోను కూడా రాంగోపాల్ వర్మ పోస్టు చేశాడు. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.
Meet https://t.co/YvsA26QWZN Donald Jong Trump Un pic.twitter.com/FLILd52sBH
— Ram Gopal Varma (@RGVzoomin) 17 April 2017