: రేపు గుణదలలో దేవినేని నెహ్రూ అంత్యక్రియలు
గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడలోని గుణదల ఆయన స్వస్థలం. ఇక్కడి హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి నుంచి దేవినేని మృతదేహాన్ని అంబులెన్స్ లో విజయవాడకు తరలించారు.