: పదేళ్ల నాటి మాటలపై ఇప్పుడీ వివాదమేంటి?: సినీ దర్శకుడు రాజమౌళి


బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రకు ప్రాణం పోసిన సత్యరాజ్, ఎప్పుడో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి, వివాదం సృష్టించడమేంటని 'ఇండియాటుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి ప్రశ్నించారు. కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన సత్యరాజ్ కు వ్యతిరేకంగా, 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' చిత్రాన్ని కర్ణాటకలో అడ్డుకుంటామని చెప్పడం సమంజసం కాదని అన్నారు.

ఐదు సంవత్సరాలుగా తాను సత్యరాజ్ తో కలిసి పని చేశానని, ఆయన ఇతరులను బాధపెట్టే వ్యక్తి కాదని చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి నెట్లో అందుబాటులో ఉన్న వీడియోలు చూశానని, అవి తొమ్మిదేళ్ల నాటివని చెప్పిన రాజమౌళి, ఆ తరువాత సత్యరాజ్ నటించిన 30 చిత్రాలు విడుదలయ్యాయని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తడం సరికాదని అన్నారు. ఘన విజయాన్ని సాధించిన చిత్రంపై వ్యాఖ్యలు చేసి, ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News