: మరమ్మతుల నేపథ్యంలో... విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల నిషేధం
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై అన్ని రకాల వాహనాల రాకపోకలనూ నిలిపివేస్తున్నట్టు అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 24 వరకూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. బ్యారేజ్ పై పలు గేట్లు తుప్పుపట్టి ఉండటంతో, తదుపరి వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యేలోగా వాటి మరమ్మతు పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేపటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కాగా, ఈ నిర్ణయంతో, బ్యారేజ్ కి ఆవలివైపున ఉన్న సీతానగరం ప్రజలు నగరానికి రావాలంటే, సుమారు కిలోమీటరు పొడవున్న బ్యారేజ్ మీదుగా రాలేరు. వారు దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారధి మీదుగా రావాల్సి వుంటుంది!