: హైదరాబాదు నుంచి అంబులెన్సులో నెహ్రూ భౌతికకాయం తరలింపు... వద్దంటున్నా ప్రత్యేక వాహనాల్లో హైవే ఎక్కిన అభిమానులు!
దేవినేని నెహ్రూ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకు వస్తున్నామని, ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎవరూ హైదరాబాద్ కు బయలుదేర వద్దని దేవినేని అవినాష్ ప్రకటించినప్పటికీ, వందలాది మంది నెహ్రూ అభిమానులు ప్రత్యేక వాహనాల్లో హైవే ఎక్కేశారు. కృష్ణా జిల్లా ప్రారంభమయ్యే జగ్గయ్యపేట మండలం గరికపాడు నుంచి ఆయన మృతదేహం వెంట ర్యాలీగా విజయవాడకు రావాలన్న ఉద్దేశంతోనే అభిమానులు బయలుదేరారని తెలుస్తోంది. కాగా, నెహ్రూ మృతదేహం కొద్దిసేపటి క్రితం అంబులెన్స్ లో విజయవాడకు బయలుదేరింది. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహం వెంట ఉన్నారు.