: అనుచరులెవ్వరూ హైదరాబాదు రావొద్దు: దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్
దేవినేని నెహ్రూ మృతి వార్త ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. దీంతో, దేవినేని అనుచరులు, వర్గీయులు, అభిమానులు హైదరాబాదు కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో దేవినేని కుమారుడు అవినాష్ స్పందిస్తూ, అనచరులు, అభిమానలు ఎవ్వరూ హైదరాబాద్ కు రావొద్దని సూచించారు. తన తండ్రి మృతదేహాన్నిఈ రోజు సాయంత్రం విజయవాడకు తరలిస్తున్నామని, రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, పలువురు నేతలు, ప్రముఖులు ఇప్పటికే కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.