: దేవినేని రాజకీయ ప్రస్థానం ఇలా కొనసాగింది!
తెలుగుదేశం పార్టీ నేత దేవినేని నెహ్రూ ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన దేవినేని.. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురవడం ఆ పార్టీ నేతలను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. 1954 జూన్ 22న దేవినేని నెహ్రూ జన్మించారు. 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ)ను నెహ్రూ ఏర్పాటు చేశారు. విజయవాడ రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానం ఇలా కొనసాగింది...
* 1983లో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో రాజకీయ ప్రవేశం చేశారు.
* 1983, 1985, 1989, 1994, 2009లో విజయవాడ సమీపంలోని కంకిపాడు నుంచి, తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఆయా సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు
* 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.
* ఎన్టీఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* 2004 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాను. అయితే, 2009లో గెలిచారు.
* 2014లో ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
* రాష్ట్ర పునర్విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు
* ఇటీవలే మళ్లీ టీడీపీలోకి దేవినేని వెళ్లారు.