: దేవినేని నెహ్రూ అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం: స్పీకర్ కోడెల


టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ మృతిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానమని, ఎన్టీఆర్ ను నెహ్రూ దైవంగా పూజించేవారని అన్నారు. రాజకీయాల్లో తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేశామని, అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్నామని నాటి విషయాలను కోడెల గుర్తు చేసుకున్నారు. దేవినేని నెహ్రూ మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News