: ‘విశాఖ-అరకు’ అద్దాల బోగీ ప్రత్యేకతలు ఇవిగో!
విశాఖ-అరకు మధ్య తిరిగేందుకు విలాసవంతమైన ఓ అద్దాల బోగీ (విస్టాడోమ్ కోచ్) ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రయాణికులకు ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 19వ తేదీ నుంచి ప్రయాణానికి అనుమతిస్తారు. ఇక, ఈ అద్దాల బోగీ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..
* ఒక్కో కోచ్ లో సీట్ల సంఖ్య 40
* ఒక్కో టికెట్ ధర రూ.650
* బోగీ తయారీకి రూ.3.38 కోట్లు ఖర్చు
* పూర్తి స్థాయి ఎయిర్ కండిషన్ అయిన ఈ కోచ్ లో కుర్చీలన్నీ 360 డిగ్రీల కోణంలో తిరుగుతాయి.
* దానంతట అదే తెరచుకునే ఆటోమేటిక్ డోర్. ఈ కోచ్ లోని ఒక్కో విండో అద్దం 2200x1250 మి.మీ. వైశాల్యం.
* జీపీఎస్ అనుసంధానిత కోచ్ లు కావడంతో స్టేషన్ల వివరాల్ని ముందే తెలుసుకోవచ్చు.
* హెచ్ డీ సీసీ కెమెరాలు ఉండే ఈ కోచ్ లో ప్రయాణికుల కోసం ఎల్ సీడీ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
* మరో ప్రత్యేకత ఏంటంటే.. అరకు లోయ అందాలను చూసేందుకు గాను కోచ్ లోనే ఓ చివర ప్రత్యేక లాంజ్ ను అమర్చారు.
* విమానాల్లో మాదిరి ఇక్కడ కూడా ఆహారం అందిస్తారు. ఇందుకుగాను, సిబ్బందిని, ట్రాలీలను ఏర్పాటు చేశారు.