: ఏపీలో ‘బడికొస్తా’ పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
ఏపీలో ‘బడికొస్తా’ పథకాన్ని సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రారంభించనున్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న 1.82 లక్షల మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేస్తారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తోందని, తొమ్మిదో తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నామని చెప్పారు.