: రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదం నేపథ్యంలో... సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతల వెల్లువ!


తెలంగాణ అసెంబ్లీలో రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదం పొందడంపై పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో బీసీ కమిషన్ చైర్మన్ రాములు, ఇతర సభ్యులు ఉన్నారు. కాగా, రిజర్వేషన్ల పెంపు బిల్లుతో పాటు, న్యూ హెరిటేజ్ పాలసీ, జీఎస్టీ బిల్లులకు టీ శాసనమండలి నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత బిల్లులు పాస్ అయినట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. 

  • Loading...

More Telugu News