: చంద్రబాబుగారి మీద నాకు కోపం లేదు.. కొంచెం ఆవేదన ఉంది: ధూళిపాళ్ల నరేంద్ర


ఇటీవల జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి లభించలేదనే బాధ నుంచి బయటపడ్డానని, తన పని తాను చేసుకుపోతున్నానని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఒక అవకాశం వస్తుందని అనుకున్నాను. రాలేదు. నాకు మంత్రి పదవి వస్తుందని కార్యకర్తలు భావించారు. దీంతో, వారు భావోద్వేగాలకు గురయ్యారు. సీఎంను కలిసిన తర్వాత నేను కొంత ఎమోషనల్ గా ఫీలైన మాట వాస్తవమే. ఎందుకంటే, నేను మొదటి నుంచి ఎమోషనల్. పదేళ్ల పాటు అపోజిషన్ లో ఉండి పని చేశాము. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించి .. గట్టిగా నిలబడి పార్టీ కోసం పనిచేశానని సీఎంకు చెప్పాను. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి, ఒక్క అవకాశం ఇవ్వమని సీఎంను కోరాను. ‘చూస్తాను’ అని సీఎం చెప్పారు. అడగడం మా ధర్మం.. నాయకుడిగా బాబు గారి ఇష్టం. చంద్రబాబు గారి మీద నాకు కోపమైతే లేదు కానీ, కొంచెం ఆవేదన మాత్రం ఉంది’ అని నరేంద్ర చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News