: నిజామాబాద్ లో చీరలు అమ్మిన ఎంపీ కవిత!
గులాబీ కూలీ దినాల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ కవిత చీరలు అమ్మారు. స్థానిక ఎల్వీఆర్ షాపింగ్ మాల్ లో ఆమె చీరలు విక్రయించి సుమారు రూ.7 లక్షల వరకు సంపాదించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితోనే, రిజర్వేషన్ పెంపు బిల్లును కూడా సాధించుకుంటామని అన్నారు. కాగా, ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న ఐస్ క్రీమ్స్ విక్రయించిన మంత్రి కేటీఆర్ రూ.7.30 లక్షలు సంపాదించారు.