: నిర్లక్ష్యానికి చోటివ్వకండి: ప్రధాని మోదీ సూచన
నిర్లక్ష్యానికి చోటివ్వవద్దని, దేశ వ్యాప్తంగా సుపరిపాలన, పేదలకు శక్తి నివ్వడమే మంత్రంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ ముగింపు సమావేశంలో ఈ రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, బీజేపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలని, కష్టాన్ని మాత్రమే నమ్ముకుని పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. తమ ఓటమికి గల కారణాలు తెలుసుకోవడానికి బదులు ఈవీఎంలను తప్పబట్టడం తగదని అన్నారు.