: ఇచ్చినప్పుడు సంతోషపడటం.. ఇవ్వనప్పుడు ఏడవడం కరెక్టు కాదు: ఎంపీ శివప్రసాద్ పై సుజనా చౌదరి సెటైర్
వయసు ఎక్కువై సహనం కోల్పోయిన వాళ్లే అసంతృప్తితో ఉన్నారని, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెప్పింది కరెక్టో కాదో తనకు తెలియదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. దళితులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు చేసిన శివ ప్రసాద్, క్లారిటీ తీసుకుని మాట్లాడితే బాగుండేదని అన్నారు. ‘ఇచ్చినప్పుడు సంతోషపడటం.. ఇవ్వనప్పుడు ఏడవడం కరెక్టు కాదు’ అంటూ పరోక్షంగా శివప్రసాద్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు కేటాయించే విషయంలో టీడీపీ మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతినే పాటిస్తోంది తప్పా, ఎవరికీ అన్యాయం చేయడం జరగదని సుజనా చౌదరి అన్నారు.