: జగన్ జైలు కెళ్తాడో.. చర్చికి వెళ్తాడో మాకు తెలియదు!: సుజనా చౌదరి
జగన్ జైలు కెళ్తాడో.. చర్చికి వెళ్తాడో తమకు తెలియదని, ఆయన్ని జైలుకు పంపాల్సిన అవసరం తమకు తెలియదని టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరమని తామేమి చెప్పలేదని, జగన్ తో విభేదించడం వల్లే వాళ్లు తమ పార్టీలో చేరారని చెప్పారు. సామాజిక సమతుల్యం కోసమే తమ పార్టీలోకి వచ్చిన ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చామని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేరదీసుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలో మార్పులు చేర్పులు చేయడం జరిగిందన్నారు.