: పవన్ కల్యాణ్ ని వాడుకుని వదిలేయలేదు: సుజనా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వదిలివేయలేదని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ తో ప్రయోజనాలు ఏంటో పవన్ కల్యాణ్ వస్తే క్లారిటీ ఇస్తా. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదనే స్పెషల్ ప్యాకేజ్ కు ఒప్పుకున్నాము. హోదాతో అదనంగా వచ్చేది 30 శాతం నిధులే.. ప్యాకేజ్ తో దాని కంటే ఎక్కువ వస్తున్నాయి. రాష్ట్రానికి మేం సాధించినంత మరెవరూ సాధించలేదు. ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ఇబ్బంది పడలేదు. పని లేని పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని వివాదం చేస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు.