: నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు: హీరో ప్రభాస్


హీరో ప్రభాస్ తన పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతాడా? అని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రేపో, మాపో ఆ విషయంపై క్లారిటీ ఇస్తాడని అందరూ అనుకుంటున్న తరుణంలో తన పెళ్లి గురించి ప్రభాస్ ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. ‘ప్రభాస్ మ్యారేజ్ ఈ ఇయరా? నెక్స్ట్ ఇయరా?’ అని ఓ న్యూస్ ఛానెల్ లో ప్రశ్నించగా, ‘ఎవడికి తెలుసు? నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు’ అని సమాధానం చెప్పాడు. తన చిన్నతనంలో డబ్బులు దొంగిలించానని, చాలా కాలంగా విశ్రాంతి లేకుండా పని చేశానని ఆయా ప్రశ్నలకు యంగ్ రెబల్ స్టార్ సరదాగా సమాధానమిచ్చాడు.

 

  • Loading...

More Telugu News