: చంద్రబాబు రౌడీ రాజ్యం.. గూండా రాజ్యం నడిపిస్తున్నారు: జోగి రమేష్
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, చంద్రబాబు రౌడీ రాజ్యం .. గూండా రాజ్యం నడిపిస్తున్నారని విమర్శించారు.
‘మున్సిపల్ ఎన్నికలలో చంద్రబాబు, లోకేష్ ల జోక్యం అవసరమా? ప్రజాస్వామ్యం ఎటు పోతోంది? అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారు. చంద్రబాబును శ్రీ కృష్ణదేవరాయలతో కాదు ఔరంగజేబుతో పోల్చుకోవాలి. టీడీపీ నేతలే చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చంద్రబాబు నైజాన్ని ఎంపీ శివప్రసాద్ బట్టబయలు చేశారు’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.